fbpx
HomeMovie News'తిమ్మరుసు' గా సత్యదేవ్

‘తిమ్మరుసు’ గా సత్యదేవ్

Satyadev NewMovieAnnouncement Timmarusu

టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది తారలు చిన్న చిన్న క్యారెక్టర్ లతో సినీ ప్రయాణం ప్రారంభించి గొప్ప గొప్ప తీరాలని చేరుతుంటారు. ఇప్పటికే కొన్ని మైలు రాళ్ళని దాటుకుంటూ తన నటన తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న హీరో ‘సత్యదేవ్‘. స్క్రీన్ పైన కొన్ని సెకన్లు కనిపించే పాత్రలతో ప్రయాణం ప్రారంభించి ఇపుడు హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే స్టేజి కి వెళ్ళాడు ఈ కుర్ర హీరో.

మొన్ననే ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమా ద్వారా ఓటీటీ హిట్ అందుకొని, తమన్నా తో ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా షూటింగ్ లో ఉన్నాడు ఈ హీరో. ఇపుడు మరొక సినిమాని కూడా ప్రకటించాడు. ఈ హీరో సినిమా టైటిల్స్ కూడా కాచీ గా ఉంటాయి. అతడు నటిస్తున్న కొత్త చిత్రం పేరు ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ నిర్మిస్తున్నారు. మిగతా వివరాలేవీ తెలియనప్పటికీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని అర్ధం అవుతుంది. ఈ హీరో స్టోరీ సెలెక్షన్ దృష్ట్యా ఈ సినిమా కూడా కంటెంట్ ఓరియెంటెడ్ అని అలాగే ఈ సినిమా తాలూకు టైటిల్ లోగోని చూస్తే కూడా తెలుస్తుంది. ‘తిమ్మరుసు -అసైన్ మెంట్ వాలి’ అంటూ టైటిల్ తోనే ఆకట్టుకున్నాడు సత్యదేవ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular