fbpx
HomeMovie Newsఎక్స్ పెక్టేషన్స్ మ్యాచ్ చేసేలా 'వి' ట్రైలర్

ఎక్స్ పెక్టేషన్స్ మ్యాచ్ చేసేలా ‘వి’ ట్రైలర్

NaniSudheerbabu Vmovie TrailerReleased

టాలీవుడ్: నాని, సుధీర్ కాంబినేషన్ లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వి’. ఈ సినిమా సెప్టెంబర్ 5 న ప్రైమ్ ఓటీటీ లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో నాని, సుధీర్ తో పాటు నివేత థామస్, అదితి రావు హైదరి నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘హలో హలో హలో.. మైక్ టెస్టింగ్ 123..’ అంటూ నాని చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ”జనరల్ గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసమే ఇలాంటి పనులు చేస్తుంటారు” అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ తో నాని విలనీష్ షేడ్ లో ఉండే హీరో అని అర్ధం అవుతుంది. ట్రైలర్ లో చూపించిన ఫైట్స్, చేస్ సీన్స్ అన్ని కలిపితే ఇది ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది. ట్రైలర్ మొత్తం లో అదితి రావు పాత్రని రివీల్ చెయ్యలేదు. నివేత పాత్ర కూడా ట్రైలర్ లో ఇలా వచ్చి ఆలా వెళ్ళిపోతుంది. ఇంకా ట్రైలర్ చివరలో వచ్చే ‘మళ్ళీ ఎక్సపెక్టేషన్స్ కి మ్యాచ్ కాలేదనే మాట రాకూడదు’ అనే డైలాగ్ సరిగ్గా ట్రైలర్ కి తగ్గట్టే ఉంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ తో మంచి విజువల్స్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం అందించగా, థమన్ బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular