fbpx
HomeNationalరేపు ప్రధాని మోడీ కీలక ఉపన్యాసం! ఏమి చెప్పనున్నారు?

రేపు ప్రధాని మోడీ కీలక ఉపన్యాసం! ఏమి చెప్పనున్నారు?

PM-SPEECH-ON-INDEPENDENCE-DAY

న్యూఢిల్లీ : 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్నారు. దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి తన ప్రసంగంలో “ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు” పధకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు ఈ పధకాన్ని చేపట్టబోతున్నారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకంలో భాగంగా వ్యక్తికి జరిగే చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. ఆస్పత్రులు, క్లినిక్‌లు, వైద్యులను కేంద్ర సర్వర్‌తో అనుసంధానిస్తారు. అయితే ఈ పధకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే వదిలివేస్తారని సమాచారం.

అయితే, ఈ కార్డును కోరుకున్న వారికి ఒక యూనిక్‌ ఐడీని కేటాయిస్తారు. ఈ యూనిక్ ఐడీ ద్వారా వారు సిస్టమ్‌లోకి లాగిన్‌ అవుతారు. దశలవారీగా అమలు చేసే ఈ పధకానికి రూ 300 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు కూడా ఇప్పటికే జరిపారు. ఈ పథకం ప్రయోజనాల్లో కీలకమైనది ఏంటంటే దేశంలో ఏ వైద్యుడు, ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిక్‌ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలించే వీలు ఉంటుంది.

ఆధార్‌ కార్డు తరహాలో ఈ హెల్త్‌ కార్డును జారీ చేస్తారు. దేశంలో వైద్యారోగ్య పరిస్ధితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పధకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ పధకాన్ని ఆపై మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్‌లో అనుసంధానిస్తారు. రోగి అనుమతితోనే వైద్యులు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular