fbpx
HomeLife Styleశానిటైజర్ అతిగా వాడుతుంటే జాగ్రత సుమా!

శానిటైజర్ అతిగా వాడుతుంటే జాగ్రత సుమా!

SANITIZER-FOR-KILLING-CORONA-VIRUS

హైదరాబాద్: ఏ విషయంలో నైనా అతి మంచిది కాదు‌ అన్నది ప్రాచీన సామెత. ఇప్పుడు ఈ సామెత శానిటైజర్‌ విషయంలోనూ వర్తిస్తుంది. ఎక్కువగా శానిటైజర్‌ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి మరియు అవసరమైన బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో ఉపయోగపడుతుంది.

ఇలాంటి మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే మన శరీరం రోగాల బారిన పడే ప్రమదం ఉంది. అంతేగాక తరచుగా శానిటైజర్‌ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది. శానిటైజర్‌కు అలవాటుపడి, దాని నిరోధక శక్తిని పెంచుకుంటుంది.

ఇక మనం శానిటైజర్‌తో స్నానం చేసినా లాభం లేకుండా పోతుంది. అయితే మనం శానిటైజర్‌ను ఎక్కువగా వాడుతున్నామా లేదా తెలుసుకోవటం ఎలా అన్నది కొంచెం కష్టం. కానీ, ఈ క్రింది సందర్భాలలో శానిటైజర్‌ వాడకుండా ఉండటం ఉత్తమం.

1) సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పుడు కచ్చితంగా శానిటైజర్‌ వాడకానికి దూరంగా ఉండండి. ఓ 20 సెకన్ల పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవటం ద్వారా క్రిముల్ని తరిమికొట్టొచ్చని ‘యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ చెబుతోంది.

2) మీ చేతులకు విపరీతంగా దుమ్ము, ధూళీ అంటుకున్నప్పుడు కూడా శానిటైజర్‌ను‌ ఉపయోగించకండి. చేతులు ఎక్కవ అపరిశుభ్రంగా ఉన్నపు​డు ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తాయి. అంతేకాకుండా క్రిముల్ని చంపడంలోనూ విఫలమవుతాయి.

3) చుట్టుప్రక్కల ఉన్న వారు తుమ్మినా, దగ్గినా కొంతమంది వెంటనే శానిటైజర్‌ రాసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల ఏ లాభమూ ఉండదు. గాల్లోని క్రిములను శానిటైజర్‌ చంపలేదని గుర్తించాలి. అదో భయానికి గురై తరచూ దాన్ని వాడటాన్ని తగ్గించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular