fbpx
HomeBig Storyప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే, బీహార్‌ నుంచే మొదలు!

ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే, బీహార్‌ నుంచే మొదలు!

PK-ENTERING-DIRECT-POLITICS-ANNOUNCES-SHOCKING-DECISION

పాట్నా: దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరు గాంచిన ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) ఎవరి ఊహకందని ట్విస్ట్‌ ఇచ్చారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు సంకేతాలిచ్చిన పీకే దానికై అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

దీనికి సంబంధించి ఇవాళ ఉదయం ప్రశాంత్ కిషోర్ ఒక ట‍్వీట్‌ చేశారు. తన పదేళ్ల రోలర్‌ కోస్టర్‌ ప్రయాణం తరువాత , ఇంతకాలం ప్రజల పక్షాన విధివిధానాలు రూపొందించినట్లు ట్వీట్‌ చేసిన ఆయన ఇక నుంచి జన్‌ సురాజ్‌ (ప్రజలకు సుపరిపాలన) దిశగా అడుగులు వేయబోతున్నట్లు తెలిపారు.

ఇక ఈ ట్వీట్‌తో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు దాదాపు ఖరారు చేయగా, బీహార్‌ నుంచి తన ప్రయాణం మొదలుపెడుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular