fbpx
HomeMovie News'ఇచట వాహనములు నిలుప రాదు' ట్రైలర్

‘ఇచట వాహనములు నిలుప రాదు’ ట్రైలర్

IVNR Trailer Release

టాలీవుడ్: ‘చి ల సౌ ‘ సినిమాతో మొదటి డీసెంట్ హిట్ కొట్టాడు సుశాంత్. తర్వాత ‘అల వైకుంఠపురం లో ‘సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో మెరిశాడు. ప్రస్తుతం ‘ఇచట వాహనములు నిలుప రాదు’ అనే సినిమాతో మరి కొద్దీ రోజుల్లో తన సినిమా విడుదల చేయనున్నాడు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. లవ్, కామెడీ, యాక్షన్, సస్పెన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని కలిపిన కాంబో పాక్ లాగా ఉంది ట్రైలర్

సుశాంత్ పని చేసే ఆఫీస్ లో ఉండే తన కొలీగ్ అయినా హీరోయిన్ ని లవ్ చేస్తాడు సుశాంత్. తన ప్రియురాలి ఇంటికి వెళ్ళినపుడు ఒక ప్లేస్ లో తన కొత్త బండి పార్క్ చేస్తాడు. అక్కడి నుండి సుశాంత్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నాడు. అసలు ఆ టైం లో ఆ కాలనీ లో ఎం జరుగుతుంది. ఆ బండి దొంగిలించే ముఠా ఏంటి, వాళ్ళకి పోలీసులకి సంబంధం ఏంటి వీటన్నిటిని సుశాంత్ ఎలా అధిగమించి తనకి వచ్చిన సమస్య నుండి బయటపడ్డాడు అనే విషయం ఆధారంగా సినిమా రూపొందింది. ఒక రొమాంటిక్ యాక్షన్ సస్పెన్స్ సినిమాగా ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.

‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమాలో నటించిన వెంకట్ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత నెగెటివ్ షేడ్స్ లో ఉండే పాత్రలో కనిపించాడు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి మరిన్ని పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం లో ఈ సినిమా రూపొందింది. A1 స్టూడియోస్ మరియు శాస్త్ర సినిమాస్ బ్యానర్స్ పై రవి శంకర శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ సినిమాని నిర్మించారు. ఎస్.దర్శన్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 27 న థియేటర్లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular