fbpx
HomeMovie Newsరెజీనా 'నేనే నా..?' ఫస్ట్ లుక్

రెజీనా ‘నేనే నా..?’ ఫస్ట్ లుక్

Regina NENENAA MovieFirstLook

టాలీవుడ్: టాలెంట్ ఉండి మంచి నటి అని గుర్తింపు తెచ్చుకున్నా కూడా ఎందుకో టాప్ లీగ్ హీరోయిన్ జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయింది రెజీనా కాసాండ్రా. తెలుగు లో దాదాపు అందరు చిన్న, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించిన రెజీనా చివరగా అడవి శేష్ నటించిన ‘ఎవరు’ థ్రిల్లర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం రెజీనా నటిస్తున్న మరో సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసారు. రెజీనా ‘నేనే నా ?’ అనే సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా ఈ సినిమాలో రెజీనా ఫస్ట్ లుక్ విడుదల చేసారు సినిమా టీం.

ఫస్ట్ లుక్ లో పాతి పెట్టిన ఒక డెడ్ బాడీ ని ఓపెన్ చేసి క్లూస్ కలెక్ట్ చేస్తున్న ఆఫీసర్ లుక్ లో చూపించారు. ఈ సినిమాలో రెజీనా ఒక పోలీస్ ఆఫీసర్ లేదా ఇన్వెస్టిగేటివ్ క్లూస్ టీం ఆఫీసర్ పాత్ర పోషించి ఉండాలి. ఈ విజయం తనకి కావాల్సిన బ్రేక్ ఇవ్వాలని, అందరి ఆశీర్వాదాలు కావాలి అని ట్వీట్ చేస్తూ ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసింది రెజీనా. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. థ్రిల్లర్ సినిమాలకి మంచి సంగీతం అందించే సామ్ సి.ఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కార్తీక్ రాజు రచన మరియు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ మరియు విడుదల తేదీ ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular