fbpx
HomeMovie Newsఓటీటీ లో మరో మళయాళ సినిమా

ఓటీటీ లో మరో మళయాళ సినిమా

Kuruthi Movie OTTRelease

మాలీవుడ్: లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి చాలా సినిమాలు ఓటీటీ వైపు మల్లాయి. వేరే ఇండస్ట్రీస్ లో ఓటీటీ రిలీజ్ లు కేవలం చిన్న సినిమాలకే పరిమితం అయ్యాయి. కానీ మళయాళం లో మాత్రం ఇండస్ట్రీ లోని సీనియర్ నటులు మోహన్ లాల్, ఫాహద్, పృథ్విరాజ్ సుకుమారన్ సినిమాలు కూడా ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 సినిమా ప్రైమ్ వీడియో లో ప్రకంపనాలు సృష్టించింది. ఫాహద్ ‘సి యూ సూన్’, ‘మాలిక్’, ‘జోజి’ తో ఇప్పటికి మూడు సినిమాలు ఓటీటీ లో విడుదల చేసారు. ఈ మధ్యనే పృథ్వి రాజ్ నటించిన ‘కోల్డ్ కేసు’ అనే సినిమాకూడా ఓటీటీ లో విడుదలైంది.

ఈ సినిమాలే కాకుండా మలయాళం లో అంతకముందు విడుదలైన చాలా సినిమాలకి ఓటీటీ లో డిమాండ్ ఏర్పడింది. కొన్ని సినిమాలని ఆహ లాంటి రీజనల్ ఓటీటీ లో డబ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మరో మళయాళం సినిమా ఓటీటీ లో విడుదల అవనుంది. పృథ్విరాజ్ సుకుమారన్ , రోషన్ మత్యుస్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘కురుత్తి’ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అవనుంది. ఓనం సందర్భంగా ఆగష్టు 11 న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular