fbpx
HomeMovie Newsసుశాంత్ చివరి సినిమా ట్రైలర్ విడుదల

సుశాంత్ చివరి సినిమా ట్రైలర్ విడుదల

Sushant Dil Bechara Trailer Release

ముంబై: సుశాంత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బెచారా‘ ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల అయింది. దీనికి సంబందించిన అప్డేట్ మేకర్స్ ముందుగానే సోషల్ మీడియా లో పెట్టడం తో ఉదయం నుండి ఈ సినిమా గురించి ట్విట్టర్ లో ట్రెండ్ నడుస్తుంది. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి నటించారు. సంజనా కూడా ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి అని పేర్కొన్నారు.

ఈ సినిమాలో సుశాంత్ నవ్వు చూసిన వారెవ్వరూ బాధ పడకుండా ఉండరు. ట్రైలర్ లో సుశాంత్ నుంచి వచ్చే ప్రతీ డైలాగ్ కూడా ఆయన అభిమానుల్ని కట్టి పడేసేలా ఉంది.
‘ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం డిసైడ్ చేయలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లో ఉంది’
అంటూ ట్రైలర్‌లో వినిపిస్తున్న సుశాంత్ డైలాగులు అభిమానుల కళ్ల నుంచి కన్నీళ్లు తెప్పించాయి.

ముఖేష్ చాబ్రా దర్శకత్వం వచించిన ఈ సినిమాని ఫాక్స్ స్టార్ట్ స్టూడియో బ్యానర్ పైన నిర్మించారు.ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ ఏ ఆర్ రెహమాన్ సంగీతం. ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమా ట్రైలర్ పోస్ట్ చేసి దర్శకుడు ముఖేష్ చాబ్రా కూడా ఒక ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ఈ సినిమాని సబ్స్క్రిప్షన్ తో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ఈ సినిమాని జులై 24 నుండి disney+hotstar డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు ఇదివరకే అధికారిక ప్రకటన విడుదల అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular