fbpx
Saturday, September 7, 2024
HomeMovie Newsసంక్రాంతికి సినిమాల విడుదలతో పాటు టీజర్ ల సందడి

సంక్రాంతికి సినిమాల విడుదలతో పాటు టీజర్ ల సందడి

NewMovieTeaser Releases OnSankranthi

టాలీవుడ్: సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్ళకి పెద్ద పండగ. సినిమా వాళ్ళు కూడా సమ్మర్ తర్వాత సంక్రాతి పెద్ద సీజన్ లాగా భావిస్తారు. అందుకే వీలైనంత వరకు సంక్రాంతి కి సినిమాని విడుదల చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ పాండెమిక్ టైం లో కూడా ఈ సారి మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సినిమా అప్ డేట్స్ మరియు సినిమా టీజర్లు, ట్రైలర్ లు కూడా విడుదల అవుతుంటాయి. ఈ సంక్రాంతి కి కూడా అదే సందడి కనిపించబోతుంది.

సంక్రాతి సందర్భంగా జనవరి 14 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. షూటింగ్ దాదాపు ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన ఈ సినిమా టీం సమ్మర్ విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాతి సందర్భంగా టీజర్ ని విడుదల చేసి ప్రొమోషన్ కూడా ప్రారంభించనున్నారు.


శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా పైన చైతు మరియు శేఖర్ కమ్ముల ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా పోస్టర్స్ కి పాటలకి కి వస్తున్న రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. ఈ సినిమా టీజర్ కూడా జనవరి 10 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇవే కాకుండా రానా ‘అరణ్య‘, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’, రాజమౌళి RRR , నాని ‘టక్ జగదీశ్’, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాలకి సంబందించిన అప్ డేట్స్ కూడా విడుదల అవబోతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular