fbpx
Saturday, July 27, 2024
HomeAndhra Pradeshరోజూ 9 మంది ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల మృతి

రోజూ 9 మంది ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల మృతి

TRAFFIC-VIOLATIONS-KILL-9PEOPLE-DAILY-IN-AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజూ ట్రాఫిక్‌ ఉల్లంఘనల కారణంగా తొమ్మిదిమంది మృతి చెందుతున్నట్లు సమాచారం. నిత్యం జరుగుతున్న ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది వరకు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించేవారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ లెక్కలు చెబుతున్నాయి.

గడచిన నాలుగు సంవత్సరాలలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్‌ తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఈ నివేదిక విశ్లేషించింది. మన రాష్ట్రంలో ఏటా 35 శాతం ద్విచక్ర వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి.

ఈ వాహనాలను నడుపుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల తలకు గాయాలై ప్రాణాలను కోల్పోతున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా జరిమానాలు కూడా పెంచి ప్రజలకు షాకిచ్చింది.

పెంచిన ఈ జరిమానాల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు. వాహన తనిఖీలను ముమ్మరం చేసి రహదారి భద్రతపై పూర్తి అవగాహన కల్పించాలని రవాణా మరియు పోలీస్‌ శాఖలు నిర్ణయించాయి. నేటి నుంచి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతి రోజూ రవాణా శాఖ అధికారులకు ఓ కార్యక్రమాన్ని నిర్దేశించింది.

ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై రాష్ట్రంలో రోజూ 80 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్సు ఉండి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారికి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాల్లో భాగంగా పునశ్చరణ తరగతులు నిర్వహించడంపై ప్రణాళిక రూపొందించారు.

పెరిగిన ట్రాఫ్ఫిక్ ఉల్లంగనల జరిమానా వల్ల గతంలో హెల్మెట్‌ ధరించకపోతే రూ.100 జరిమానా ఉన్నది ఇప్పుడు జరిమానా రూ.వెయ్యికి పెంచడంతో ఉల్లంఘించేవారి సంఖ్య 15 శాతానికి తగ్గింది. ఈ ఏడాది సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 20 వరకు హెల్మెట్‌ ధరించని వారిపై 1,947 కేసులు నమోదు చేశారు. తరువాత నెలలో 1,650 కేసులు నమోదయ్యాయి. అంటే హెల్మెట్‌ ధరించేవారిసంఖ్య 15 శాతం పెరిగింది. ఓవర్‌ స్పీడ్‌కు జరిమానా రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు పెంచారు. దీంతో కేసులు వెయ్యి నుంచి 900కు (పదిశాతం) తగ్గాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular