fbpx
HomeMovie Newsసందీప్ కిషన్ 'A1 ఎక్స్ ప్రెస్' ఫస్ట్ లుక్

సందీప్ కిషన్ ‘A1 ఎక్స్ ప్రెస్’ ఫస్ట్ లుక్

SandeepKishan A1ExpressMovie FirstLook

టాలీవుడ్: తన పదేళ్ల కెరీర్ లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అనే ఒక హిట్ పలు యావరేజ్ సినిమాలతో కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ తన ల్యాండ్ మార్క్ సినిమా అయిన 25 వ సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని తన సొంత నిర్మాణంలోనే ఒక మంచి స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా మూవీ ని ఎంచుకుని షూటింగ్ చేస్తున్నాడు. ‘A1 ఎక్స్ ప్రెస్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు పోస్టర్లు కొన్ని విడుదల అయ్యి అక్కట్టుకున్నాయి. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాలో సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ విడుదల చేసి త్వరలోనే థియేటర్లలో విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో సందీప్ కిషన్ ఒక హాకీ ప్లేయర్ లాగా కనిపించబోతున్నాడు.

హాకీ నేపథ్యం లో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఇండియన్ జెర్సీ వేసుకుని కనిపించాడు. మ్యాచ్ విన్నింగ్ తర్వాత ఆ ఆనందం తో చొక్కా విప్పి గాల్లో ఎగరేస్తున్నట్టు ఫస్ట్ లుక్ లో చూపించారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ తో పాటు లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. వెంకటాద్రి టాకీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై సందీప్ కిషన్, దయా పన్నెం, టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకోలను అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా తెలుగు కి పరిచయం అవుతున్నాడు. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. త్వరలో సినిమా విడుదల గురించి మరిన్ని వివరాలు ప్రకటించబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular