fbpx
Friday, April 19, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsఫస్ట్ లుక్ : సూసైడ్ ఆర్ మర్డర్

ఫస్ట్ లుక్ : సూసైడ్ ఆర్ మర్డర్

 SachinTiwari SuicideOrMurder FirstLook

బాలీవుడ్: కారణం ఏదైనాగాని మంచి ఫామ్ & ఫేమ్ ఉండగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఊహించని పరిణామానికి చాలా మంది చలించారు. దీనిపైన బాలీవుడ్ వ్యాప్తంగా ముఖ్యంగా నేపోటిజం(వారసత్వం) పైన సోషల్ మిడిల్ లో చాల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ సుశాంత్ మరణం ఒక మిస్టరీనే. పోలీస్ డిపార్ట్మెంట్ ఆత్మహత్య అని తేల్చేసినా కూడా సుశాంత్ సన్నిహితులను, స్నేహితులను ఇంటరాగేషన్ నిర్వహిస్తుంది.

సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య పై ఇంకా అనుమానాలు ఉన్నాయి. పోలీసులు పోస్ట్ మార్టం మరియు ప్రాధమిక విచారణలో భాగంగా తెలుసుకున్న విషయాల ప్రకారం సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం అంతటి స్టార్ డం ఉన్న హీరో చిన్న చిన్న కారణాలతో డిప్రెషన్ కు గురై ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సుశాంత్ ఆత్మహత్య గురించి ఒక చిత్రంను రూపొందించబోతున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

సచిన్ తివారీ ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. చూడ్డానికి సుశాంత్ మాదిరిగా ఉండే ఈయన్ను మేకర్స్ సుశాంత్ క్యారెక్టర్ కి ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంకు విజయ్ శేఖర్ గుప్త దర్శకత్వం వహించబోతున్నాడు. ‘సుసైడ్ ఆర్ మర్డర్’ అనే టైటిల్ ని బట్టి చూస్తుంటే సుశాంత్ డెత్ మిస్టరీ పైన ఆధారపడి ఈ సినిమా ఉంటుంది అని అర్ధం అవుతుంది. దీనికి టాగ్ లైన్ గా ‘ఆ స్టార్ వాస్ లాస్ట్’ అని పెట్టారు. అలాగే ఇంట్రొడ్యూసింగ్ సచిన్ తివారి యాజ్ అవుట్ సైడర్ అంటే వారసత్వం లేకుండా బయటి నుండి వచ్చిన స్టార్ అన్నట్టు చెప్పకనే చెప్పారు మేకర్స్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular