fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsవెంకీ మామ తో 'మోసగాళ్లు' టైటిల్ వీడియో రిలీజ్

వెంకీ మామ తో ‘మోసగాళ్లు’ టైటిల్ వీడియో రిలీజ్

Mosagallu TitleMotionPoster Released

హైదరాబాద్: మంచు విష్ణు, కాజల్ బ్రదర్ సిస్టర్ గా నటిస్తున్న సినిమా ‘మోసగాళ్లు’. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇపుడు ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ ద్వారా విడుదల చేసారు. ‘రైజ్ అఫ్ మోసగాళ్లు’ అంటూ ఈ వీడియో ని విడుదల చేసారు. ప్రపంచం లో పెద్దదైన ఐటి స్కాం ఆధారంగా ఈ సినిమా రూపొందించబోతున్నట్టు ఇదివరకే మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.’సంపాదించిన.. స్కామ్ చేసినా.. డబ్బు ఒకటే’ అనే థీమ్ తో వస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.

‘మోసగాళ్లు’ టైటిల్ లో US $ 100 నోటుతో డిజైన్ చేయబడి స్టైల్ గా ఆకర్షణీయంగా ఉంది. దీనికి ఉపయోగించిన థీమ్ మ్యూజిక్ వింటుంటే ఈ మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఉండబోతోందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ లాస్ ఏంజెల్స్ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. అలానే ‘మోసగాళ్లు’ లో రుహానీ సింగ్ – నవదీప్ – నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular