fbpx
HomeMovie Newsషూటింగ్ పునః ప్రారంభించిన సుదీప్

షూటింగ్ పునః ప్రారంభించిన సుదీప్

KichaSudeep Resumes MovieShooting

శాండల్ వుడ్: ఈగ, బాహుబలి సినిమాల ద్వారా తెలుగు వాళ్ళకి సుదీప్ సుపరిచితుడే. తాను చివరగా నటించిన సైరా నరసింహ రెడ్డి లో కూడా మంచి పాత్ర పోషించాడు. ఇక్కడ తెలుగులో గెస్ట్ రోల్స్ చేసినా కూడా కన్నడ లో సుదీప్ ఫేమస్ కమర్షియల్ హీరో. అక్కడ అందరూ కిచ్చా సుదీప్ అని పిలుస్తారు ఎందుకంటే కిచ్చా అనే సినిమాతో ఈ హీరో అక్కడ బాగా పాపులర్ అయ్యాడు.

లాక్ డౌన్ కారణంగా సినిమాలు అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ అడపా దడపా తప్ప షూటింగ్స్ ఏవి మళ్ళీ పూర్తిగా మొదలవ్వలేదు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ నటిస్తున్న కన్నడ సినిమా ‘ఫాంటమ్’ కూడా కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. ఈరోజే ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదీప్ ట్వీట్ చేస్తూ చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్నందుకు మళ్ళీ నాకు నచ్చిన పని (సినిమాల్లో నటించడం) చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేసారు. నా ప్యాషన్ ని వొదిలి పెద్ద సెలవు తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చినట్టుందన్నాడు. మళ్ళీ విక్రాంత్ రోనా గా (ప్రస్తుతం చేసున్న సినిమాలో క్యారెక్టర్ పేరు) మీ ముందుకు వస్తా అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular