fbpx
Friday, April 19, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsనారప్ప పెద్ద కొడుకు ఫస్ట్ లుక్

నారప్ప పెద్ద కొడుకు ఫస్ట్ లుక్

Narappas Elderson Firstlook

తమిళ్ లో వెట్రిమారన్ డైరెక్షన్ లో ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ అసురన్ కి రీమేక్ ఏ విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న నారప్ప సినిమా. ఈ సినిమాకి తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్‌ ఖాతాలో విడుద‌ల చేసింది. ఈ సినిమాలో ఈ పాత్ర‌లో కార్తీక్ ర‌త్నం న‌టిస్తున్నాడు. ఈ రోజు ఆయ‌న పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నట్లు సురేశ్ ప్రొడక్షన్స్‌ తెలిపింది.

కార్తీక్ ర‌త్నం, థియేటర్ ఆర్టిస్ట్. c/o కంచరపాలెం తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ కుర్ర హీరో యాక్టింగ్ మరియు లుక్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. మంచి హిట్స్ పడితే తొందరగా పైకి వచ్చే టాలెంట్ ఉంది.

అలాగే కార్తీక్ నటిస్తున్న మరొక సినిమా ‘అర్ధ శతాబ్దం’, ఈ సినిమా నుండి కార్తిస్ గ్లిమ్ప్స్ రానా దగ్గుబాటి చేత విడుదల చేయించారు టీం. టైటిల్ చూడగానే పాజిటివ్ వైబ్స్ పాస్ అవుతున్నాయి, అలాగే ఈ గ్లిమ్ప్స్ లో వచ్చే బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా అద్భుతం గా ఉంది. ‘ది డెమోక్రాటిక్ వయోలెన్స్’ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో మరొక హీరో గా నవీన్ చంద్ర కూడా నటిస్తున్నారు. ఈ సినిమాని రవీంద్ర ఫూలే అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం లో రిషిత శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పైన చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular