టాలీవుడ్: ఇపుడు సినిమాలు మాత్రమే కాకుండా లాక్ డౌన్ తర్వాత నుండి వెబ్ సిరీస్ ల సంఖ్య బాగా పెరిగింది. వెబ్ సిరీస్ లు అంటే ఆఫీస్ కల్చర్ , పబ్ కల్చర్ మాత్రమే కాకుండా పల్లెటూళ్ళు అక్కడ ఉండే వాతావరణం ని బేస్ చేసుకొని కూడా చేస్తున్నారు. అలాంటి ఒక ప్రయత్నమే ‘కంబాల పల్లి కథలు’ అనే వెబ్ సిరీస్ ద్వారా చేస్తున్నారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మాణంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ మొదటి చాప్టర్ ‘మెయిల్’ అనే పేరుతో రూపొందింది. ఈ మొదటి చాప్టర్ కి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది. 2005 సంవత్సరం లో అప్పుడప్పుడే పల్లె టూళ్లలో కంప్యూటర్ అంటే ఏంటో జనాలు తెలుసుకుంటున్న నేపధ్యం లో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆ సమయం లో పల్లెటూళ్లలో ఉన్న పరిస్థితులు, కంప్యూటర్ అంటే జనాల రియాక్షన్, కంప్యూటర్ గురించి తెల్సిన వాళ్ళు ఇచ్చే బిల్డ్ అప్ ఇవన్నీ కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇలాంటి పరిస్థితిని అనుభవించిన వారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత తమ జ్ఞాపకాలని తలచుకుంటారు. ఇలాంటి రియలిస్టిక్ సీన్స్ తో వెబ్ సిరీస్ కంటెంట్ లు రూపొందిస్తే సూపర్ రెస్పాన్స్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ప్రియదర్శి, హర్షిత్ రెడ్డి, మణి ఇందులో ముఖ్య పాత్రలు పోష్టిస్తున్నారు. ఉదయ్ గుర్రాల దర్శకత్వం లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ జనవరి 12 నుండి ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.