fbpx
HomeSportsఇంగ్లాండ్ భారత పర్యటన పూర్తి షెడ్యూలు విడుదల

ఇంగ్లాండ్ భారత పర్యటన పూర్తి షెడ్యూలు విడుదల

ENGLAND-SERIES-SCHEDULE-ANNOUNCED

న్యూఢిల్లీ: టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌కు సర్వ సన్నద్ధమవుతోంది. ఆస్ట్రేలియా తొలి‌ టెస్టు తరువాత భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనుండగా, ఇషాంత్ మరియు హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే.

వీరితో పాటుగా ఆసీస్‌ తో మ్యాచుల్లో సత్తా చాటిన రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి యువ ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల్లోనూ చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆరంభం కానున్న టీమిండియా- ఇంగ్లండ్‌ సిరీస్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది బీసీసీఐ.

4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌:

►ఇంగ్లండ్‌తో జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఫిబ్రవరి 5న ప్రారంభం కానుంది.
వేదికలు: చెన్నై, అహ్మదాబాద్‌
►చెన్నై(ఎంఏ చిదంబరం స్టేడియం)లో ఇరు జట్ల మధ్య తొలి రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
►మూడో టెస్టు(డే అండ్‌ నైట్‌), నాలుగో టెస్టుకు అహ్మదాబాద్‌ వేదిక కానుంది.
తొలి టెస్టు: ఫిబ్రవరి 5-9, చెన్నై(ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభం)
రెండో టెస్టు: ఫిబ్రవరి 13-17, చెన్నై(ఉదయం 9.30)
మూడో టెస్టు(డే/నైట్‌): ఫిబ్రవరి 24-28, అహ్మదాబాద్‌(మధ్యాహ్నం 2.30 నిమిషాలు)
నాలుగో టెస్టు: మార్చి 4-8, అహ్మదాబాద్‌(ఉదయం 9.30 నిమిషాలు)

ఐదు టీ20 మ్యాచ్‌లు:
►భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జరుగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అహ్మదాబాద్‌ ఆతిథ్యం అందించనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఇక ఇక్కడ కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలో 5 టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
తొలి టీ20: మార్చి 12, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: మార్చి 14
మూడో టీ20: మార్చి 16
నాలుగో టీ20: మార్చి 18
ఐదో టీ20: మార్చి 20

మూడు వన్డేలు:
►టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు పుణె వేదిక కానుంది.
తొలి వన్డే: మార్చి 23 (మధ్యాహ్నం 1.30 నిమిషాలు)
రెండో వన్డే: మార్చి 26
మూడో వన్డే: మార్చి 28

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular