fbpx
Friday, March 29, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie News'దిల్ బేచారా' ట్రైలర్ రికార్డుల మోత

‘దిల్ బేచారా’ ట్రైలర్ రికార్డుల మోత

DilBechara Trailer Records

ట్విట్టర్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’. ఈ సినిమా జూలై 24న disney+hotstar డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతుంది. 2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా ఈ చిత్రాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్, 4 మిలియన్ లైక్స్ కూడా తెచ్చుకుంది. ఇక లైక్స్ విషయానికి వస్తే సుశాంత్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ట్రైల‌ర్‌కు కేవలం 14 నిమిషాల్లో 100k లైక్స్, అలాగే 98 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ దక్కించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు దక్కించుకోకపోవడం గమనార్హం. సుశాంత్ కి ఘన నివాళులు అర్పించే ఉద్దేశ్యం తో దిల్ బేచారా ట్రైల‌ర్‌ను ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ అవెంజర్స్ సిరీస్‌లో వచ్చిన ఇన్ఫినిటీ వార్‌, ఎండ్ గేమ్ మూవీస్ ట్రైలర్లను దాటేసింది. కాగా, మున్ముందు మరిన్ని రికార్డులను బీట్ చేయాలని ఫ్యాన్స్ సన్నద్ధం అయ్యారు. ఈ మూవీలో సుశాంత్ జోడిగా సంజన సంఘి నటించగా, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ ఏ ఆర్ రెహమాన్ సంగీతం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular