హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా కొత్త కొత్త ఛాలెంజ్ లు విసురుకుంటూ సొంత అభివృద్ధి కోసమే కాకుండా కొన్ని సార్లు సమాజానికి మంచి విషయాన్ని తెలియచేసే విషయం లో కూడా సెలెబ్రటీస్ ముందుంటున్నారు. అదే కోవలో ఇప్పుడు coronaquiltproject అని నమ్రత మహేష్ మొదలుపెట్టారు. ప్రపంచానికి మనం ఏది ఇస్తామో అదే మల్లి మనకి తిరిగి వస్తుందని అందుకే ద్వేషం మీద ప్రేమని, కోపం మీద జాలిని, స్వార్థం మీద నిస్వార్థాన్ని ఎంచుకోవాలని అలాగే ఇలాంటి కాస్త పరిస్థితుల్లో తమ ఆర్ట్ ద్వారా బంధాలని బలపరచుకోవాలని తెలియచేస్తూ తన పీస్ అఫ్ ఆర్ట్ ని పోస్ట్ చేశారు. అలాగే ఈ ఛాలెంజ్ కి మరికొందరు తారల్ని ఆహ్వానించారు.
ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన సమంత తన టాలెంట్ ని చిన్న చిన్న మొక్కల ఆకులతో ప్రపంచ పాఠాన్ని తయారు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. గ్రీన్, కలర్ అఫ్ హోప్ అని అలాగే జీవితం లో మనం వెనక్కి చూసుకుంటే ఇలాంటి రోజులని దాటుకొని వచ్చామని గర్వం గా ఫీల్ అవుతామని చెప్పారు. తాను చెప్పిన ఫిలాసఫీ తాను ఆకులతో తయారు చేసిన ప్రపంచ పటం అభిమానులని అమితంగా ఆకర్షిస్తున్నాయి. తనని నామినేట్ చేసినందుకు నమ్రత కి ధన్యవాదాలు తెలియచేస్తూ తాను ఇంకొందరు తారల్ని నామినేట్ చేసింది.