fbpx
Friday, April 26, 2024
HomeLife Styleకరోనా వైరస్ నుంచి రక్షణకు ఇంటి మాస్కులే ఉత్తమం

కరోనా వైరస్ నుంచి రక్షణకు ఇంటి మాస్కులే ఉత్తమం

CLOTH-MASKS-CONTAIN-CORONA-BETTER

వాషింగ్టన్‌: కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఫేస్ ‌మాస్కుల వినియోగం భారీగా పెరిగింది. వైరస్‌ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు దాదాపు ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కు ధరిస్తున్నారు. కొందరు సర్జికల్‌, రిస్పిరేటర్ మాస్కులు ధరిస్తుంటే, చాలా మటుకు ప్రజలు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్త్రంతో మాస్కు తయారు చేసుకుంటున్నారు.

అందువల్ల క్లాత్‌ ఫేస్‌ కవరింగ్‌ మాస్కులకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి మాస్కులు సురక్షితమేనా? వైరస్‌ కణాలను అడ్డుకోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయా? లేదా అన్న సందేహాలు చాలా మందికి తలెత్తుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న సింగిల్‌ లేయర్ మాస్కులే ఉత్తమమైనవని పేర్కొన్నారు.

అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్కులు మెడికల్‌ మాస్కుల కంటే ఏమాత్రం తీసిపోవని, పైగా గాలి పీల్చుకోవడంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జర్నల్‌ ఆఫ్‌ ఎక్స్ట్రీమ్‌ మెకానిక్స్‌ లెటర్స్‌ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

మరి అలాంటి మాస్కులు ధరించినా ఉపయోగం ఉండదు కదా. నిజానికి మెడికల్‌ మస్కులు అందరికీ అందుబాటులో లేకపోయిన్పటికీ ఇంట్లో వాడే కామన్‌ ఫ్యాబ్రిక్‌లతో కూడా వైరస్‌ బారిన పడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందని నిరూపించడమే మా ఉద్దేశం. ఈ ప్రయోగంలో మేం మొత్తం 11 రకాల వస్త్రాల(బెడ్‌షీట్లు, కర్చిఫ్‌లు వంటివి)ను పరిశీలించాం.

ఇందులో కొత్తవాటితో పాటుగా వాడినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత వేగంతో ప్రయాణించే 100 నానోమీటర్‌ పార్టికల్స్‌ను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవని నిరూపితమైంది. ఇలాంటివి సింగిల్‌ లేయర్‌ మాస్కులైనా సరే ఎదుటి వ్యక్తి మాట్లాడినపుడు, తుమ్మినపుడు లేదా దగ్గినపుడు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు’’ అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular