fbpx
HomeBig Storyచైనాలో మనుషులకు తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు

చైనాలో మనుషులకు తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు

CHINA-REPORTS-FIRST-BIRDFLU-CASE-IN-HUMANS
Meta

బీజింగ్‌: చైనా ఎప్పుడూ అద్భుతాలు చేస్తూనే ఉంటుంది. తాజాగా చైనా ప్రపంచంపై మరో బాంబు లాంటి వార్త విసిరింది. ప్రపంచంలోనే మొదటి సారిగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌లో కొత్త స్ట్రెయిన్‌ మనుషులకి సోకడంతో యావత్ ప్రపంచ దేశాలు మొత్తం ఉలిక్కి పడ్డాయి. చైనాలో ఈ వైరస్‌ తొలిసారిగా ఒక వ్యక్తికి సోకిందని అక్కడి ప్రభుత్వం అధికారికంగా దృవీకరించింది.

చైనా లోని తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఒక 41 ఏళ్ల వ్యక్తికి మే 28వ తేదీన బర్డ్‌ ఫ్లూ వైరస్‌లోని ‘హెచ్‌10ఎన్‌3 రకం’ సోకినట్టుగా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. అయితే అతనికి వైరస్‌ ఎలా సోకింది? ఎక్కడ్నుంచి వచ్చింది అనే విషయాలను మాత్రం ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. కాగా ఈ హెచ్‌10ఎన్‌3 వైరస్‌ మనుషులకి సోకడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని మాత్రం తెలిపింది.

కానీ మరోవైపు ఈ వైరస్‌ వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ జరిగేది లేదంటూ దీన్ని తక్కువగా చేసి చూపించే ప్రయత్నాలను అప్పుడే డ్రాగన్‌ దేశం మొదలుపెట్టింది. పక్షుల నుంచి మనుషులకి ఈ వైరస్‌ చాలా అరుదుగా సోకుతుందని వెల్లడించిన ఆరోగ్య శాఖ, ఈ వైరస్‌తో మనుషులకు పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని పేర్కొంది.

అయితే ఈ బర్డ్‌ ఫ్లూ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రేపో మాపో అతన్ని డిశ్చార్జ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీజీటీఎన్‌ టీవీ వెల్లడించింది. ఇప్పటివరకు కోళ్లకు, ఇతర పక్షులకు ప్రాణాంతకంగా మారిన హెచ్‌5ఎన్‌8 రకం మనుషులకి సోకే ప్రమాదం చాలా తక్కువగానే ఉంది.

కాగా కోళ్ల ఫామ్స్‌లో పని చేసే వారికి మాత్రమే ఈ వైరస్‌ ముప్పు అధికంగా ఉండేది. కానీ ఇప్పుడు హెచ్‌10ఎన్‌3 రకం వైరస్‌ సోకడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. జ్వరం వంటి సాధారణ ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఆ వ్యక్తికి చేసిన పరీక్షల్లో బర్డ్‌ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular