fbpx
HomeSportsషాబాజ్ నదీం స్థానంలో రెండో టెస్టుకు అక్షర్ పటేల్

షాబాజ్ నదీం స్థానంలో రెండో టెస్టుకు అక్షర్ పటేల్

AXARPATEL-REPLACES-SHABAZ-NADEEM-IN-SECOND-TEST

చెన్నై: భారత్ లో భారత్ తో జరిగిన మొదటి టెస్టు లో విజయం సాధించి ఆత్మ విశ్వాసంలో ఉంది ఇంగ్లండ్ జట్టు. కాగా ఈనెల 13 నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌ కోసం భారత తుది జట్టులో కీలక మార్పులు చేసే యోచనలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలొనే మొదటి టెస్టు మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శనతో విఫలమైన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో అనుభవం ఉన్న ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్‌లో నదీమ్‌ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికీ, నాలుగు రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు.

తన మోకాలికి గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమైన అక్షర్‌ పటేల్‌, తరువాత జరిగే రెండవ టెస్టులో జట్టులోకి వచ్చేది దాదాపుగా ఖరారైనట్టే. అతను నెట్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్షర్ ఇంత వరకు భారత్ తరఫున ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల అక్షర్‌ పటేల్, కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడాడు‌. అతను ఇంకా టెస్ట్‌ క్రికెట్ లో‌ అరంగేట్రం చేయాల్సివుంది. కాగా, ఇంగ్లండ్‌తో చెపాక్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 0-1 తేడాతో వెనకపడివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular