న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఇంటిలోను ఒకటో రెండో స్మార్ట్ ఫోన్లు లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న అవసరానికి మనం ఎక్కువ శాతం మొబైల్ మీదే ఆధారపడి జీవిస్తున్నాం. ఏ చిన్న సమస్యకైనా మనకు ఏదో ఒక యాప్ రూపంలో పరిష్కారం లభిస్తుంది.
ఇలాంటి యాప్స్ ద్వారా మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వాటి వల్ల అన్నే నష్టాలూ కూడా ఉన్నాయి. ప్లే స్టోర్ లో ఉండే ఇటువంటి యాప్స్ వల్ల మన ఫోన్ లో ముఖ్య సమాచారం హ్యాకర్ల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సంస్థలు వాటి పేర్లను బహిర్గతం చేస్తూ మనల్ని అప్రమత్తం చేస్తుంటాయి.
ఇలాంటి జాబితానే డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న యాప్స్‌ని గుర్తించి ఒక లిస్ట్ బయటపెట్టింది. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి.
ప్రతి నెల ఇలా వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా తమ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించింది అవాస్ట్. అందుకే వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒక వేల డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే వీటిని మొబైల్ నుండి తొలగించాలని పేర్కొంది.
డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్ జాబితా ఇదే:
స్కిన్స్, మాడ్స్ ఫార్ మైంక్రాఫ్ట్ పీఈ
స్కిన్స్ ఫార్ రోబ్లాక్స్
లైవ్ వాల్‌పేపర్స్ హెచ్డీ & 3డి బ్యాక్‌గ్రౌండ్
మాస్టర్ క్రాఫ్ట్ ఫార్ మైంక్రాఫ్ట్
మాస్టర్ ఫార్ మైంక్రాఫ్ట్
బాయ్స్ అండ్ గర్ల్స్ స్కిన్స్
మ్యాప్స్ స్కిన్స్ అండ్ మాడ్స్ ఫర్ మైంక్రాఫ్తంఇనెచ్రఫ్త్