fbpx
HomeLife Styleఅమెజాన్ లో మొబైల్స్ పై బంపర్‌ ఆఫర్లు

అమెజాన్ లో మొబైల్స్ పై బంపర్‌ ఆఫర్లు

AMAZON-FAB-PHONES-FESTIVAL

న్యూఢిల్లీ: భారత్ లో ఈ-కామర్స్ దిగ్గజాలలో ఒకటైన అమెజాన్ దేశంలోని మొబైల్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అని పిలువబడే ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సేల్ లో లభించే మొబైల్, మొబైల్ సంబంధిత ఇతర ఉపకరణాలపై డిస్కౌంట్, ఒప్పందాలను హైలైట్ చేయడానికి కంపెనీ ఇప్పటికే మైక్రోసైట్‌ను రూపొందించింది.

అమెజాన్ తన మైక్రోసైట్‌లో సేల్ విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లను జాబితాను విడుదల చేసింది. అమెజాన్ విడుదల చేసిన జాబితాలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ నార్డ్ 5జీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, రెడ్‌మీ నోట్ 9 ప్రో మాక్స్, రెడ్‌మీ 9 ప్రైమ్, వన్‌ప్లస్ 8 టీ 5జీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21 ఇంకా మరిన్ని ఉన్నాయి.

కాగా, స్మార్ట్‌ఫోన్‌ల తగ్గింపు ధరలు ఎంత అనేది కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. రేపు అనగా డిసెంబర్ 19 ధరలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో ఇప్పుడు పవర్ బ్యాంకులు, హెడ్‌ఫోన్లు, మొబైల్ కేసులు, కవర్లు, కేబుల్‌లతో సహా ఇతర మొబైల్ ఉపకరణాలపై కూడా డిస్కౌంట్లను అందిచనుంది.

వన్‌ప్లస్, నోకియా, షియోమి, హానర్, శామ్‌సంగ్, ఎల్‌జి, రియల్‌మే, ఆపిల్, ఒప్పో, జాబ్రాతో సహా ప్రముఖ బ్రాండ్లపై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 1,500 రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular