fbpx
HomeAndhra Pradeshబన్నీ సీటిమార్ కి స్టెప్పులేయనున్న సల్మాన్

బన్నీ సీటిమార్ కి స్టెప్పులేయనున్న సల్మాన్

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ అనేక దక్షిణ భారత సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేసారు. సినిమాలు మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ సినిమాల లోని బ్లాక్ బస్టర్ పాటల రీమేక్ లకు కూడా సల్మాన్ తోడ్పడ్డాడు.

తాజా సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య2 లోని రింగా రింగా పాట ను డింకా చీక గా రీమిక్స్ చేసిన తరువాత, సల్మాన్ మరో అల్లు అర్జున్ పాట కు కాళ్ళు కదిలించడానికి సిద్ధంగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం రాధే లో, అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమా లోని ప్రసిద్ధ సీటీ మార్ పాటను రీమేక్ చేస్తున్నారు. రెడీ చిత్రం కోసం దింక చీక ను స్వర పరిచిన డిఎస్పి మరోసారి ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం పని చేసారు. రాధే కోసం దేవి శ్రీ ప్రసాద్ గీతాలలో ప్రత్యేక నెంబర్‌ను తీసుకోవాలని ప్రభుదేవా సల్మాన్ ఖాన్ నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సీటీ మార్ పాట విన్న సల్మాన్ ఖాన్ కు వెంటనే నచ్చి ఈ సాంగ్ ని రీమేక్ చేయమన్నారు.

అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాని మేకర్స్ ప్రస్తుతం ట్రాక్ పై పని చేస్తున్నారు మరియు తుది అవుట్ పుట్ ఇంకా రాలేదు. సల్మాన్ ఖాన్ యొక్క రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ 2020 మే 22న ఈద్ కానుక గా విడుదల కావాల్సి ఉంది. కాని లాక్డౌన్ కారణంగా ఆలస్యం అయింది. సల్మాన్ ఖాన్తో పాటు దిశా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ వంటి తారలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular