fbpx
HomeAndhra Pradeshటాలీవుడ్ షూటింగ్ మార్గదర్శకాలు విడుదల

టాలీవుడ్ షూటింగ్ మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్: కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించడం ద్వారా సినిమా షూటింగులకు అనుమతులు ఇవ్వాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నపటికీ, నిర్మాతలు ఈ భారాన్ని భరించవలిసినందున ముందుకు వెళ్లే దారి కష్టతరం గా కనిపిస్తునది. పెద్ద బడ్జెట్ సినిమాలను బ్యాంక్రోలింగ్ చేస్తున్న ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లు, ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై తలలు బద్దలుకొట్టుకుంటున్నాయి.

నివేదికల ప్రకారం, ఫిల్మ్ షూటింగుల అనుమతి కోసం పరిశీలనలో ఉన్న కొన్ని మార్గదర్శకాలు దిగువన.
• సిబ్బందికి పిపిఇ కిట్లు తప్పనిసరిగా ఉండాలి
• శానిటైజేషన్ పాయింట్లు
• తారాగణం, సిబ్బంది ప్రతి షాట్‌కు ముందు మరియు తరువాత చేతులను శుభ్రపరచాలి
• ఆహారం – ఎక్కువగా స్వీయ ఆహారం. బఫేలు, పెద్ద సమావేశాలు లేవు.
• షూటింగ్ ప్రదేశాలలో 60-ప్లస్ వయస్సు గల నటులకు అనుమతి లేదు
• కౌగిలింతలు లేవు, ముద్దులు లేవు, పోరాట సన్నివేశాలు లేవు
• పరిమిత సిబ్బందితో షూటింగ్ (50 కన్నా తక్కువ)
• ఏదైనా సిబ్బంది / తారాగణం కరోనా పాజిటివ్ గా షూట్ సమయంలో నిర్ధారించబడితే చికిత్స ఖర్చులను భరించడం నిర్మాత యొక్క బాధ్యత.

ఈ మార్గదర్శకాల ప్రకారం ఫిల్మ్ షూటింగులను ప్రారంభించడానికి నిర్మాతలు అంత పెద్ద రిస్క్ తీసుకోకపోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరందుకుంటున్నప్పటికీ, పరిస్థితి ఇంకా అస్పష్టంగా కనిపిస్తున్నందున సినిమా షూటింగులకు కొంత సమయం పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular