fbpx
HomeBig Storyఢిల్లీలో పవార్‌ను కలిసిన దీదీ, విపక్షాల భేటీపై ఉత్కంఠ!

ఢిల్లీలో పవార్‌ను కలిసిన దీదీ, విపక్షాల భేటీపై ఉత్కంఠ!

MAMATA-BENARJEE-MET-SARADPAWAR-IN-NEWDELHI

న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్‌ సీఎం అయిన మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ఇవాళ ఢిల్లీలో కలిశారు. రేపు నిర్వహించబోయే వివక్షాల సమావేశం మరియు త్వరలోనే జరిగే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆమె శరద్ పవార్‌తో చర్చించినట్లు సమాచారం.

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల రేసులో విపక్ష పార్టీలన్నింటికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలిపే ప్రయత్నంలో భాగంగా ఆమె ఈ భేటీ నిర్వహించనున్నారు. 15వ తేదీన నిర్వహించబోయే ఈ విపక్షాల సమావేశానికి సీఎం మమతా బెనర్జీ 22 మంది నేతలను ఆహ్వానించారు.

దీనిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కేరళ సీఎం విజయన్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌లకు కూడా మమతా ఆహ్వానాన్ని పంపారు.

కాగా నేషనల్ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి సైతం ఆమె తన ఆహ్వానం పంపారు దీదీ. ప్రతిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేష్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జీవాలే భేటీకి హాజరు అవనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యమయ్యాయనే సంకేతాన్నిపార్టీలు చూపిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రేపటి భేటీకి ఎవరెవరు హాజరవుతారనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular