fbpx
HomeInternationalయాషెస్ తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్!

యాషెస్ తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్!

ENGLAND-TEST-TEAM-ANNOUNCED-FOR-ASHES-TEST-WITH-AUSTRALIA

లండన్: ఇంగ్లండ్ జట్టు త్వరలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్ జరగనున్న‌ నేపథ్యంలో మొదటి టెస్టుకు తమ జట్టును ప్రకటించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా డిసెంబరు 8వ తేదీన ప్రారంభం కానున్న మ్యాచ్‌ కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టు జాబితాను వెల్లడించింది.

ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్‌ ఆండర్సన్ మోకాలి నొప్పి కారణంగా ‌ ఫాస్ట్‌ బౌలర్‌ ‌జట్టుకు దూరం కాగా, మార్క్‌ వుడ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, ఓలీ రాబిన్సన్‌ స్పెషలిస్టు ఫాస్ట్‌బౌలర్లుగా ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. జో రూట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

ఇంగ్లండ్ జట్టు:
►జో రూట్‌(కెప్టెన్‌), స్టువర్ట్‌ బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, హసీబ్‌ హమీద్‌, జాక్‌ లీచ్‌, డేవిడ్‌ మలాన్‌, ఓలీ పోప్‌, ఓలీ రాబిన్సన్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్ వోక్స్‌, మార్క్‌ వుడ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular