fbpx
Sunday, April 28, 2024
HomeBig Storyఫేక్ యూనివర్సిటీల జాబితా విడుదల చేసిన యూజీసీ!

ఫేక్ యూనివర్సిటీల జాబితా విడుదల చేసిన యూజీసీ!

UGC-RELEASED-24FAKE-UNIVERSITIES-LIST

న్యూఢిల్లీ: ప్రభుత్వం నుండి పూర్తిగా అవసరమైన అనుమతులు లేకుండానే కొనసాగుతున్న 24 నకిలీ‌ విశ్వవిద్యాలయాలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ గుర్తించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. కాబట్టి సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అలాగే ప్రజల ద్వారా కూడా తమ దృష్టికి వచ్చిన నకిలీ‌ యూనివర్సిటీలను చెల్లవని చెప్పినట్లు వెల్లడించారు.

ఇంకా ఇతర రెండు యూనివర్సిటీలు సైతం యూజీసీ నిబంధనలను అతిక్రమించాయని, వాటి వ్యవహారం ప్రస్తుతానికి కోర్టులో ఉందని తెలిపారు. లోక్‌సభ సమావేశంలో వచ్చిన ఒక రాతపూర్వక ప్రశ్నకు మంత్రి ఈ విధంగా స్పందించారు. నకిలీ‌ విశ్వవిద్యాలయాలు ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శులకు ప్రత్యేక లేఖలను రాసి ఆయా ఫేక్‌ వర్సిటీలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఫేక్‌ యూనివర్సిటీల జాబితా:

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 8 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా: వారనసేయ సంస్కృతి విశ్వవిద్యాలయం, మహిళా గ్రామ్‌ విద్యాపీఠ్, గాంధీ హింది విద్యాపీఠ్, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి, నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌ విశ్వవిద్యాలయం, మహారాణా ప్రతాప్‌ శిక్షా నికేతన్‌ విశ్వవిద్యాలయ, ఇంద్రప్రస్త శిక్షా పరిషద్.

ఢిల్లీ లో కనుగొన్న 7 నకిలీ యూనివర్సిటీల జాబితా: కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ, వకేషనల్‌ యూనివర్సిటీ, ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యురిడిసియల్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక యూనివర్సిటీ)

పశ్చిమబెంగాల్‌ లోని 2 విశ్వవిద్యాలయాలు: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్, కోల్‌కతా; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్, కోల్‌కతా.

ఒడిశా రాష్ట్రంలోని 2 విశ్వవిద్యాలయాలు: నవభారత్‌ శిక్షా పరిషద్, రూర్కెలా? నార్త్‌ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ.

ఇంకా ఇతర రాష్ట్రాలైన పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడెమీ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్‌ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ, కర్ణాటకలోని బదగాన్వి సర్కార్‌ వరల్డ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ సొసైటీలు కూడా ఫేక్‌ యూనివర్సిటీలే అని యూజీసీ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular