రెండో వన్డేలోనూ ఓడిన మిథాలీ జట్టు, సిరీస్‌ ఇంగ్లండ్‌ దే

ENGLAND-WOMEN-WON-SERIES-WITH-INDIAN-TEAM

0
1952
ENGLAND-WOMEN-WON-SERIES-WITH-INDIAN-TEAM
ENGLAND-WOMEN-WON-SERIES-WITH-INDIAN-TEAM

టాంటన్: ఇంగ్లండ్ తో రెండో మ్యాచ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్(92 బంతుల్లో 7 ఫోర్లతో 59) అర్ధశతకంతో మెరిసినా, భారత మహిళా జట్టుకు మాత్రం ఓటమి తప్పలేదు. బుధవారం అర్దరాత్రి తరువాత ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు బ్యాటింగ్ బౌలింగ్ లో అధ్బుత ప్రదర్శనతో‌ అదరగొట్టి, టీమిండియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

దీని ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ ఇంకా ఉండగానే 2-0తో సిరీస్ ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు అదే రీతిలో రెండో వన్డేలోనూ కొనసాగించింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో భారత మహిళా జట్టు మూల్యం చెల్లించుకుంది.

రెండవ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యింది. క్రితం మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలమైన ఓపెనర్లు స్మృతి మంధాన(22), షెఫాలీ వర్మ(44) శుభారంభం అందించినా, మిగలిన బ్యాటర్లు ఎవరూ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే సునాయస గెలుపునందుకుంది. ఆ జట్టులో ఓపెనర్ లారెన్ విన్‌ఫీల్డ్ హిల్(42), లోయరార్డర్ బ్యాటర్లు సోఫియా డంక్లీ(73 నాటౌట్), కేథరీన్ బ్రంట్(33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, జూలన్ గోస్వామి, శిఖా పాండే, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. భారత్ పతనాన్ని శాసించిన కేట్ క్రాస్(5/34)‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే జులై 3న జరుగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.