fbpx
Saturday, October 12, 2024
HomeMovie Newsఅన్ స్టాపబుల్ 3 … ఫస్ట్ గెస్ట్ ఆ యువ హీరోనే..

అన్ స్టాపబుల్ 3 … ఫస్ట్ గెస్ట్ ఆ యువ హీరోనే..

YOUNG-HERO-TO-PARTICIPATE-IN-UNSTOPPABLE-3-AS-FIRST-GUEST
YOUNG-HERO-TO-PARTICIPATE-IN-UNSTOPPABLE-3-AS-FIRST-GUEST

మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో సీజన్ 1, 2 మంచి క్రేజ్ అందుకున్నాయి. ఇప్పుడు అన్ స్టాపబుల్ 3 కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా సీజన్ 3 ప్రారంభం కానుందని సమాచారం.

బాలకృష్ణ ఈ సీజన్‌పై చాలా ఉత్సాహంగా ఉన్నారు. గత సీజన్లకు మించి ఈ సారి మరింత మంది స్టార్ సెలబ్రిటీలు గెస్ట్‌లుగా పాల్గొనబోతున్నారని టాక్.

తాజాగా ఈ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్‌కి దుల్కర్ సల్మాన్ గెస్ట్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది.

దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఈ షోలో ఆయన ప్రమోషన్లలో భాగంగా పాల్గొంటున్నాడట.

దుల్కర్‌తో పాటు నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా ఈ ఎపిసోడ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

బాలకృష్ణ ఈ ముగ్గురితో వ్యక్తిగత విషయాలు, సినిమాల విశేషాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉండబోతుందని భావిస్తున్నారు.

మరోవైపు, సీజన్ 3లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొనవచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular