మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లో బెస్ట్ సినిమాల జాబితాలో ‘దేవర’ చేరుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి.
ఎన్టీఆర్ తో పాటు ‘దేవర’ టీమ్ మొత్తం మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ పై పూర్తిగా ఫోకస్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సెన్సార్ అయ్యింది.
సెన్సార్ మెంబర్స్ ‘దేవర’ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మూవీ రన్ టైం 2 గంటల 57 నిమిషాల నిడివి ఉందనే టాక్ బయటకొచ్చింది.
నిజానికి ఇదే రన్ టైం తో ఫైనల్ థియేటర్ కాపీ ఉంటుందని అందరూ భావించారు. అయితే కొరటాల శివ మరల మూవీ అవుట్ ఫుట్ పై వర్క్ చేసారంట.
థియేటర్స్ లో ఆడియన్స్ చూసిన తర్వాత ల్యాగ్ అయ్యిందనే ఫీలింగ్ రాకూడదని ముందుగానే ఆలోచించారు.
చాలా సినిమాలు కంటెంట్ బాగున్న కూడా హెవీ ల్యాగ్ ఉందనే విమర్శలని ఈ మధ్యకాలాంలో ఎక్కువగా ఎదుర్కొన్నాయి.
అందుకే కొరటాల శివ ముందే జాగ్రత్త పడి ఫైనల్ కాపీ రెడీ చేసారంట. కొన్ని కట్స్ తర్వాత సినిమా 2 గంటల 42 నిమిషాల నిడివి వచ్చిందనే మాట వినిపిస్తోంది.
ఇందులో దావూదీ సాంగ్ ని కూడా తొలగించి మూవీ ఎండింగ్ టైటిల్ ముందు పెట్టారనే ప్రచారం నడుస్తోంది.
ఒక వేళ నిజంగా మూవీ ఫైనల్ కాపీ నిడివి తగ్గిస్తే సినిమా రిజల్ట్ లో దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుందని భావిస్తున్నారు.