ఆధ్యాత్మికం: లక్ష్మీదేవి అనుగ్రహం! జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. అయితే మనల్ని ఆర్థిక సమస్యలు ఇతర సమస్యల కంటే ఎక్కువగా బాధిస్తాయి.
ఈ ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం. ఆమె అనుగ్రహం పొందాలంటే ఆమె ఇష్టమొచ్చిన రీతిలో మనం ప్రవర్తించాలి.
పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా పిలుస్తారు.
కాబట్టి వీటి విషయంలో శ్రద్ధగా, భక్తితో వ్యవహరించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే పొద్దుపోయే వరకు నిద్రించేవారి ఇళ్లలోనూ, సాయంత్రం నిద్రించేవారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు.
కష్టపడకుండా సోమరితనంతో సమయాన్ని వృథా చేసేవారి ఇళ్లను ఆమె వదిలి వెళ్లిపోతుంది. కలహాలు మరియు అశాంతి ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి కాలు కూడా పెట్టదని అంటారు.
పవిత్రత, ప్రశాంతత ఉండే ఇళ్లలోనే ఆమె అనుగ్రహం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తాయి.