fbpx
Wednesday, April 24, 2024
HomeAndhra Pradesh4 భాషల్లో ఒకేసారి 'చక్ర'

4 భాషల్లో ఒకేసారి ‘చక్ర’

Vishal-Chakra-Movie

విశాల్ నిర్మించి నటించిన సినిమా ‘చక్ర’. తమిళ, తెలుగు, మలయాళ మరియు కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదివరకే విడుదల అయిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఆకట్టుకున్నాయి, అదే బాటలో ట్రైలర్ కూడా 4 భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.ఈ ట్రైలర్ రిలీజ్ ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో తో రిలీజ్ చేయిస్తున్నారు నిర్మాతలు. తెలుగులో ‘రానా’ , తమిళ్ లో ‘ఆర్య’, కన్నడ లో KGF యాక్టర్ ‘యష్’, మలయాళం లో ‘మోహన్ లాల్’ ఈ సినిమా ట్రైలర్ ని ఈ నెల 27 న 5 PM కి రిలీజ్ చెయ్యబోతున్నారు.

అభిమన్యుడు తరహా లోనే హాకింగ్ , సైబర్ క్రైమ్ నేపధ్యం లో అద్భుతమైన సాంకేతిక విలువలతో యాక్షన్ మూవీ గా తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. డిటెక్టివ్, అభిమన్యుడు, అయోగ్య, పందెంకోడి 2 చిత్రాలతో తెలుగు మరియు తమిళంలో బ్యాక్ తో బ్యాక్ హిట్ చిత్రాలని విశాల్ అందించారు.ఈ సినిమా లో విశాల్ తో పాటు జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్, రెజినా కాసాండ్రా, శ్రీష్టి, మనో బాల, రోబో శంకర్, కే ఆర్ విజయ్ నటిస్తున్నారు. ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం, బాలసుబ్రమణ్యం ఛాయాగ్రహణం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular