fbpx
Thursday, April 25, 2024
HomeMovie Newsవిశాల్ చక్ర ఫస్ట్ లుక్

విశాల్ చక్ర ఫస్ట్ లుక్

Vishal Chakra

హైదరాబాద్: యాక్షన్ హీరో విశాల్ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈరోజే తాను నటించి నిర్మించిన ‘చక్ర’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. అభిమన్యుడు తరహా లోనే హాకింగ్ , సైబర్ క్రైమ్ నేపధ్యం లో అద్భుతమైన సాంకేతిక విలువలతో యాక్షన్ మూవీ గా తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. డిటెక్టివ్, అభిమన్యుడు, అయోగ్య, పందెంకోడి 2 చిత్రాలతో తెలుగు మరియు తమిళంలో బ్యాక్ తో బ్యాక్ హిట్ చిత్రాలని అందించారు. అదే విధంగా ‘చక్ర’ సినిమాని కూడా తెలుగు మరియు తమిళ్ లో విడుదల చేస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన టీజర్ లో విశాల్ లుక్ మాస్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా లో విశాల్ తో పాటు జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్, రెజినా కాసాండ్రా, శ్రీష్టి, మనో బాల, రోబో శంకర్, కే ఆర్ విజయ్ నటిస్తున్నారు. ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం, బాలసుబ్రమణ్యం ఛాయాగ్రహణం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు విశాల్ డిటెక్టివ్ సీక్వెల్ స్వీయ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు ఐన మిస్కిన్ ని బడ్జెట్ కారణాల దృష్ట్యా తొలగించి విశాల్ ఏ స్వయంగా దర్శకత్వం చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular