fbpx
HomeMovie Newsపుష్ప నుండి తప్పుకున్న సేతుపతి

పుష్ప నుండి తప్పుకున్న సేతుపతి

VijaySetupati Out Of Pushpa

చెన్నై: టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా ఎక్స్ పెక్ట్ఏషన్ భారీగా ఉన్న సినిమాల్లో పుష్ప సినిమా కూడా ఒకటి. ఈ సంవత్సరం ఆరంభంలోనే ‘అల వైకుంఠపురం లో ‘ సినిమా బ్లాక్ బస్టర్ తో కెరీర్ పీక్ స్టేజి లో ఉన్న అల్లు అర్జున్ తనకి హిట్ ట్రాక్ ఇచ్చిన సుకుమార్ తో తీయబోయే హ్యాట్రిక్ సినిమా ఇది. సుకుమార్ కూడా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేయబోయే సినిమా కాబట్టి చాలానే ఆశలు అంచనాలు ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కాస్ట్, సెట్స్ ఇలా అన్ని రకాలుగా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కానీ కరోనా వల్ల అన్నీ తారుమారయ్యాయి.

ఈ సినిమాల్లో ఒక అద్భుతమైన రోల్ లో విజయ్ సేతుపతి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విజయ్ రిజెక్ట్ చేసాడని రూమర్స్ వచ్చాయి. వీటిపై ఒక మీడియా ఇంటర్వ్యూ లో విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. పుష్ప ఆఫర్ గురించి మాట్లాడిన విజయ్ అందులో నటించాలని ఎంత ప్లాన్ చేసుకున్నా డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదట. పైగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్స్ మళ్ళీ వెంటనే పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట.రెమ్యునరేషన్ కారణంగా పుష్ప సినిమాను రిజెక్ట్ చేశాడని వస్తున్న వార్తలకు ఫైనల్ గా చెక్ పడింది.అయితే పుష్ప లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో బాబీ సింహ అని ఇంకొక కన్నడ ఆక్టర్ అని ఊహా గానాలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాల్లో అల్లు అర్జున్ కి జోడి గా రష్మిక మందన్న నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular