fbpx
Wednesday, April 24, 2024
HomeMovie News'ఆచార్య' బాటలో నారప్ప

‘ఆచార్య’ బాటలో నారప్ప

VictoryVenkatesh NarappaMovie Postponed

టాలీవుడ్: 2021 లో గడచిన నాలుగు నెలల్లో నాలుగు బ్లాక్ బస్టర్ లు చూసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. థియేటర్లు తెరచుకుంటే జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారా అన్న సందేహం నుండి సినిమా విడుదల తేదీ కోసం పోటీపడే స్టేజ్ కి వచ్చింది టాలీవుడ్. అక్టోబర్ వరకు ఉన్న మంచి డేట్స్ అన్ని ముందే లాక్ అయిపోయాయి. మే నెలలో ముగ్గురు పెద్ద హీరోల సినిమాలకి విడుదల తేదీ కూడా ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల మరో సారి సినీ అభిమానులకి సినిమాలు దూరం అవుతున్నాయి. కరోనా కారణంగా ఆంక్షలు, భయాలు ఉండడం తో థియేటర్లలోకి జనాలు ఎక్కువగా రావడం లేదు.

ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం వాయిదా పడ్డాయి. మే నెలలో విడుదల అవ్వాల్సిన మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య‘ సినిమా ని మొన్ననే వాయిదా వేశారు. ఇపుడు ఆ లిస్ట్ లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ కూడా వచ్చి చేరింది. తమిళ్ లో ధనూష్ హీరో గా రూపొందిన ‘అసురణ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్ రత్నం తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమాని కూడా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు నిర్మాతలు. పరిస్థితులు చక్కబడే వరకు ఇంట్లోనే ఉండండి , మాస్క్ ధరించండి అని విజ్ఞప్తి చేసారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాని చాలా గ్యాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular