fbpx
Wednesday, April 24, 2024
HomeMovie Newsఊర్వశి రౌటేలా 'బ్లాక్ రోజ్' ఫస్ట్ లుక్

ఊర్వశి రౌటేలా ‘బ్లాక్ రోజ్’ ఫస్ట్ లుక్

UrvashiRautela BlackRose FirstLook

టాలీవుడ్: హిందీ లో కొన్ని సినిమాల్లో నటించిన మాజీ మిస్ ఇండియా ‘ఊర్వశి రౌటేలా’. ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న సినిమా ‘బ్లాక్ రోజ్’. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఇవాళ విడుదల చేసారు. ఈ హీరోయిన్ కి టాలీవుడ్ లో ఇది మొదటి సినిమా. ఈ సినిమాని తెలుగులో మాత్రమే కాకుండా హిందీ లో కూడా విడుదల చేస్తున్నారు. సంపత్ నంది క్రియేషన్ లో మోహన్ భరద్వాజ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ‘విచక్షణలేని యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే టాగ్ లైన్ తో ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

బ్లాక్ రోజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సంపత్ నంది, ‘ఈ బిగ్ బ్యాడ్ వరల్డ్ లో రోజెస్ ఉన్నాయి.. ఆపై బ్లాక్ రోజ్ కూడా ఉంది’ అని పేర్కొన్నాడు. కాగా పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ జరుపుతున్నారు.శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular