వాషింగ్టన్: గూగుల్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్ద్ ట్రంప్.
కమలా హారిస్ అద్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుండి గూగుల్ ట్రంప్ కు వ్యతిరేకంగా పని చేస్తోందని ట్రంప్ ఆరోపించారు.
తనపై జరిగిన హత్యాయత్నం కు సంబంధించిన సమాచారం మరియు ఫోటోలు గూగుల్ లో లేవన్నారు.
గూగుల్ లో ట్రంప్ కోసం సర్చ్ చేస్తే కమలా హారిస్ కు సంబంధించిన వార్తల్సొతున్నాయన్నారు.
ఇది ఇలానే కొనసాగితే గూగుల్ మీరు షట్ డౌన్ అయ్యే ప్రమాదముంది, జాగ్రత్త అని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.
అయితే గూగుల్, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం గురించి ప్రశ్నలకు ఆటోకంప్లీట్ భవిష్యత్తు సూచనలను అందించడంలేదు అని చెప్పింది.
రాజకీయ హింసకు సంబంధించి ప్రత్యేక రక్షణలను కలిగి ఉండడం వల్ల ఆ విషయాలను గూగుల్ చూపలేదని తెలిపింది.