fbpx
Tuesday, May 24, 2022

INDIA COVID-19 Statistics

43,140,068
Confirmed Cases
Updated on May 24, 2022 9:39 pm
524,490
Deaths
Updated on May 24, 2022 9:39 pm
14,841
ACTIVE CASES
Updated on May 24, 2022 9:39 pm
42,600,737
Recovered
Updated on May 24, 2022 9:39 pm
HomeMovie Newsరిపీట్ అవ్వబోతున్న మహేష్-త్రివిక్రమ్ కాంబో

రిపీట్ అవ్వబోతున్న మహేష్-త్రివిక్రమ్ కాంబో

TenYearsfor TrivikramAndMahesh KhalejaMovie

టాలీవుడ్: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన రెండవ సినిమా ‘మహేష్ ఖలేజా’. ఈ సినిమా విడుదల అయ్యి సరిగ్గా ఇవాళ్టికి పదేళ్లు. ఈ సినిమా థియేటర్ లో విడుదల అయిన టైమింగ్ బాలేదో, జనాలకి రిసీవ్ అవలేదో లేక అంచనాలు మరీ ఎక్కువగా ఉండడం వలనో థియేటర్ లలో అంతగా ఆడలేదు. కానీ టెలివిజన్ లో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్. ఈ సినిమా ఇవాళ పదేళ్ళైన సందర్భంగా మహేష్ బాబు ట్వీట్ చేసారు. ఈ సినిమా తనకి చాలా ప్రత్యేకమని తనలోని గొప్ప నటుడిని వెలికితీసిందని తనకి ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేసారు. అలాగే త్వరలో రాబోయే మన సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు కూడా తెలిపారు.

చెప్పుకోవాలంటే మహేష్ మరియు త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్. మొదట వచ్చిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా సైలెంట్ గా హిట్ అయింది. కానీ టెలివిజన్ లో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. మహేష్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట’ చేస్తున్నాడు. త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే టైం కి షూటింగ్ అయిపోవచ్చు. ఇవి అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular