మూవీడెస్క్: యంగ్ హీరో తేజా సజ్జా, పాన్ ఇండియా చిత్రమైన “హనుమాన్” తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు.
తేజా నటన, మార్కెట్ పెరిగాక అనేక పెద్ద నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నాయి.
ముఖ్యంగా, పెద్ద నిర్మాణ సంస్థల నుండి అడ్వాన్స్‌లు కూడా అందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, తేజా మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లను తీసుకునే బదులు, ముందుగా కథ విని, తనకు నచ్చిన కథ మాత్రమే ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
గతంలో ఇతర యంగ్ హీరోలు, నిర్మాతల నుండి అడ్వాన్స్‌లు తీసుకుని, కథలు నచ్చకపోయినా నటించాల్సి రావడం వల్ల కెరీర్‌లో సమస్యలు ఎదుర్కొన్నారు.
తేజా సజ్జా మాత్రం ఈ తప్పును చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికిప్పుడు ఏ ప్రాజెక్ట్‌కు అడ్వాన్స్ తీసుకోకుండా, కథపై పూర్తిగా నమ్మకముండి సినిమా చేసే పద్ధతిని అవలంబిస్తున్నాడు.
ప్రస్తుతం, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో తేజా సజ్జా “మిరాయ్” అనే సూపర్ హీరో మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాలని భావిస్తున్నాడు.