పారిస్: ఒలంపిక్స్ 2024 లో భారత్ కు మరో పతకం లభించింది. మెన్స్ 50 మీటర్ల షూటింగ్ లో భారత ప్లేయర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటారు. ఫైనల్లో అతను 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచారు.
చైనా ప్లేయార్ 463.6 పాయింట్లతో స్వర్ణం, ఉక్రెయిన్ ప్లేయర్ కులిశ్ 461.3 పాయింట్లతో వెండి పతకం గెలిచారు.
ఈ పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటికి 3 పతకాలు వచ్చాయి. అయితే, ఇవన్నీ షూటింగ్లోనే కావడం గమనార్హం.