మూవీడెస్క్: బలగం సినిమా ద్వారా దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న వేణు ఎల్దండి, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుపై ఆడియన్స్‌లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నారు.
మొదటి సినిమాతోనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఆయన, పల్లెటూరి ఎమోషన్స్‌ను ప్రతిబింబిస్తూ గొప్ప విజయాన్ని సాధించారు.
దీంతో, ఆయన రెండో ప్రాజెక్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
“ఎల్లమ్మ” అనే టైటిల్‌తో వేణు నెక్స్ట్ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి.
కథ రెడీ అయినప్పటికీ, ఇప్పటివరకు హీరో ఎవరు అన్నది క్లారిటీ రాలేదు. ముందుగా నేచురల్ స్టార్ నాని పేరుతో ప్రచారం జరిగిందని, వారి కాంబినేషన్ గురించి కూడా మాట్లాడారు.
కానీ నాని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు ఇంకా ఫిక్స్ కాలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా, యంగ్ హీరో నితిన్ తో వేణు తన నెక్స్ట్ మూవీ చేయనున్నారని తాజా వార్తలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం నితిన్ దిల్ రాజు ప్రొడక్షన్‌లో “తమ్ముడు” సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో, ఇది నిజమవుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.
అదే సమయంలో, శర్వానంద్ కూడా వేణుతో కలిసి సినిమా చేయనున్నారని మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు గానీ, త్వరలోనే వేణు తన రెండో ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వనున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్.