fbpx
Tuesday, April 23, 2024
HomeNationalఉద్యోగాలు, అడ్మిషన్ల పై సుప్రీంకోర్టు నిర్ణయం!

ఉద్యోగాలు, అడ్మిషన్ల పై సుప్రీంకోర్టు నిర్ణయం!

SUPREME-STOPS-MARATA-RESERVATIONS

న్యూఢిల్లీ : సూప్రీం కోర్టు మరాఠాల రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో 2020-21లో ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్లలో మరాఠా కోటాపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరాఠా కోటా చట్టబద్ధతను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.

2018లో ఏర్పాటు చేసిన ఈ కోటా కింద ఇప్పటివరకూ ఎటువంటి ప్రయోజనాలు పొందినప్పటికీ వారిపై తీర్పు ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్ధల ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్‌లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం 2018 సంవత్సరంలో తీసుకువచ్చింది.

కాగా ఈ చట్టాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్‌ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించరాదని గత ఏడాది పేర్కొంది. అయితే ఇప్పుడూ తాఝా నిర్ణయం వారికి ఎటువంటి రిజర్వేషన్లు ఉండకూడదని నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular