మూవీడెస్క్: శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ గా మారింది. కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీకి, కెరీర్‌లో కొన్ని విజయాలు వచ్చినా, ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన “గుంటూరు కారం” సినిమా నుండి మంచి ఫలితాలు ఆశించినా, ఆ చిత్రం పెద్దగా విజయాన్ని సాధించలేదు.
మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” ఎప్పుడు విడుదల అవుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో, ఆమె పూర్తి ధ్యాస రాబిన్ హుడ్ సినిమాపైనే ఉంది.
తాజాగా, రవితేజతో మరోసారి జతకట్టిన శ్రీలీల, ఈ ప్రాజెక్ట్‌పై కూడా బోలెడంత ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే, శ్రీలీలను ఐటెం సాంగ్స్ చేయడానికి అనేక మంది దర్శకులు సంప్రదించారని, కానీ ఆమె అందుకు రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” సినిమాలో ఐటెం సాంగ్ చేయమని శ్రీలీలను సంప్రదించారట. కానీ, ఆమె ఈ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసిందని సమాచారం.
శ్రీలీల ఐటెం సాంగ్స్ చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ఐటెం సాంగ్ కోసం త్రిప్తి డిమ్రిని సంప్రదించినప్పటికీ, త్రిప్తి కూడా బిజీగా ఉండటంతో డేట్స్‌ను సమన్వయం చేయడం కష్టంగా మారిందని తెలుస్తోంది.
దీంతో, విశ్వంభర యూనిట్ ప్రస్తుతం ఈ సాంగ్ కోసం కొత్త యాక్టర్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉంది.
“విశ్వంభర” మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10 ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.