కొలంబో: 27 ఏళ్ల తరువాత శ్రీలంక తో సిరీస్ కోల్పోయిన భారత్. 3 మ్యాచ్ ల సిరీస్ ను 0 – 2 తో ఓడిపోయింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 50 ఓవర్లలో 248 పరుగులు చేసింది.
అవిష్క ఫెర్నాండో అద్భుత బ్యాటీంగ్ తో 96 పరుగులు చేసి లంకకు మంచి స్కోరు అందించాడు, సెంచరీ చేజార్చుకున్నాడు.
ఇంకా, కుశాల్ మెండిస్ కూడా అద్భుతంగా ఆడి 59 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక 248 పరుగులు చేయగలిగింది.
అయితే, 249 పరుగుల చేజింగ్ లో భారత్ తరఫున రోహిత్ 35, వాషింటన్ 30,కోహ్లీ 20, పరాగ్ 15 పరుగులు తప్ప మిగతా బ్యాటర్లందరూ తక్కువ స్కోరు కే అవుటవడంతో భారత్ 138 పరుగులకే అలౌట్ అయింది.
కాగా, 27 ఏళ్ళ తరువాత శ్రీలంక భారత్ పై ఒక సిరీస్ గెలిచింది. గౌతం గంభీర్ కోచ్ గా వచ్చిన తరువాత జరిగిని తొలి వన్డే సిరీస్ కోల్పోవడం శోచనీయం.