fbpx
Thursday, April 25, 2024
HomeMovie News'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ విడుదల

‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ విడుదల

SrideviSodaCenter Trailer Release

టాలీవుడ్: సుధీర్ బాబు హీరో గా విడుదలకి సిద్ధం అయిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‘ . ఈ సినిమాలో టైటిల్ రోల్ శ్రీదేవి పాత్రలో తెలుగు నటి ఆనంది కనిపించనుంది. పలాస 1970 లాంటి సినిమాని రూపొందించిన కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. పూర్తిగా గోదావరి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రాబోయే సినిమాల్లో కొద్దీ అంచనాలతో విడుదల అవనుంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసి బెస్ట్ విషెస్ తెలియ చేసారు.

ట్రైలర్ ఆరంభం లో మర్డర్ కేసు లో జైలుకి వెళ్లే సుధీర్ బాబు(సూరి బాబు) ని పరిచయం చేస్తారు. నెక్స్ట్ సీన్స్ లో వూర్లో సోడా షాప్ నడిపే శ్రీదేవి మరియు లైటింగ్ పని చేసే సూరిబాబు కి మధ్య లవ్ సీన్స్ చూపిస్తారు. ప్రతి వూర్లో ఉన్నట్టుగానే వీళ్ళ ప్రేమకి కూడా కులం తాలూకు అడ్డంకులు ఎదురవుతాయి. వాటి నేపథ్యం లో జరిగే అనేక గొడవలు, ఇది అలుసుగా తీసుకుని హీరోయిన్ తండ్రి తో చేతులు కలిపే విలన్, మధ్యలో గోదావరి నది లో దాదాపు 80 పడవలతో ఉండే ఫైట్ విజువల్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ చివర్లో ‘జైలుకి వచ్చిన మనిషి జైలునుండి బయటకి వచ్చిన మనిషి ఒకేలా ఉండరు’ అనే సూపర్ డైలాగ్ తో ట్రైలర్ ముగించారు.

సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మణి శర్మ సౌండింగ్ తో పాటు శామ్ దత్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఫిజిక్ పరంగా , ఫైట్స్ తో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. శ్రీదేవి ప్రేమ కోసం పరి తపించే పాత్రలో సుధీర్ బాబు ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు. 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జయ్ చిల్లా ,శశి దేవిరెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఆగష్టు 27 న థియేటర్లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular