fbpx
HomeMovie Newsవిక్రమ్ 'ధ్రువ నక్షత్రం' నుండి పాట విడుదల

విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’ నుండి పాట విడుదల

SongReleasedFrom Vikram DhruvaNachitram

కోలీవుడ్: సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో డైరెక్టర్ ‘గౌతమ్ వాసుదేవ్ మీనన్’ చాలా ఫేమస్. ఆయన డైరెక్షన్ కి ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. లవ్ స్టోరీస్, కాప్ స్టోరీస్ తీయడం లో గౌతమ్ మీనన్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకో తెలియదు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన మొదలు పెట్టిన చాలా సినిమాలు ఆగిపోవడం, సంవత్సరాల తరబడి ఆలస్యం అవడం జరుగుతూనే ఉంది. అలా చాలా రోజులు ఆగి నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ , ధనుష్ ‘ఎనై నొక్కి పాయుమ్ తొట్ట’ సినిమాలు విడుదల అయి చేదు ఫలితాన్ని తీసుకు వచ్చాయి.

గౌతమ్ మీనన్ మేకింగ్ లో ఇంకా ఆలస్యం అవుతున్న మరొక సినిమా ‘ధ్రువ నక్షత్రం’. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ఈ సినిమా మొత్తం ఫారిన్ లొకేషన్లోనే షూట్ చేసారు. ఈ సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, రీతూ వర్మ ఇంకా కొందరు పేరున్న నటీనటులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమానుండి ఒక పాట విడుదలైంది. ఇదివరకి హరీష్ జయరాజ్ , గౌతమ్ మీనన్ కాంబో లో వచ్చే పాటల్లాగే ఆకట్టుకుంది. పాట విడుదల చేసారు కానీ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular