చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చెన్నై లోని ఎంజిఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ఆయనని ఆగస్టు 4 వ తేదీన చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చేర్చారు. కొంత సమయం పట్టినా కూడా కరోనా నుండి కోలుకున్నారు. కానీ మిగతా సమస్యల వలన ఆయన అనారోగ్యం బాగా క్షీణించింది. మధ్యలో మెరుగవుతున్నాడు అని బాలు గారి అబ్బాయి ప్రకటించాడు కూడా. కానీ మిగతా ఆరోగ్య సమస్యల వలన ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నిన్న సాయంత్రం ఎక్మో వెంటిలేటర్ పై ఉంచారు. నిపుణులైన వైద్యబృందం చికిత్స అందిస్తున్నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు.
వైద్యులు శతవిధాలా ఆయనను కాపాడేందుకు కృషి చేశారు. ఎక్మో ట్రీట్ మెంట్ అంటే ఫైనల్ స్టేజ్ లోనే ఉన్నాడని. అది తీసేస్తే ప్రాణం పోయినట్టే లెక్క. బాలు ఇక కోలుకోడని, ఇక ఆయన బతకడని నిన్న రాత్రే వైద్యులు కూడా కన్ఫం చేసినట్టు తెలిసింది. ఈ మధ్యాహ్నం బాలు శాశ్వతంగా కన్నుమూశారు. దీంతో అధికారికంగా మధ్యాహ్నం 1.04కు బాలు చనిపోయాడని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో చాలా మంది ప్రముఖులు ఆయన్ని కలవడానికి ఆస్పత్రికి వెళ్లారు. బాలు తమ్ముడూ అంటూ ముద్దుగా పిలిచే కమలహాసన్ కూడా బాలు ని చూడడానికి వెళ్లారు. బాలు మృతితో చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ గాయకుడిని కోల్పోయినట్టైంది. సినీ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.